Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఓటు చోరీ చేసి కేంద్రంలో అధికారంలోకి వచ్చారు

Author
Posted By MANA PRAJA AKSHARAM
| 07 Oct 2026, 12:15 PM | పెద్దపల్లి
ఓటు చోరీ చేసి కేంద్రంలో అధికారంలోకి వచ్చారు

ప్రజా అక్షరం,రామగుండం (ప్రతినిధి) అక్టోబర్ 6 :-
కేంద్ర ప్రభుత్వ తీరుపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ప్రస్తుతం కనిపిస్తున్న పరిణామాలు నిరంకుశ పాలనను తలపిస్తున్నాయని ఆరోపించారు.దేశంలో ఎన్నికల వ్యవస్థ,ఓటర్ల హక్కుల పరిరక్షణపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని అన్నారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ
ఓట్లు గెలవలేక చీటింగ్ చేసి పరీక్షలో పాస్ అయినట్టుగా ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి అధికారంలోకి వచ్చారని విమర్శించారు.ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు నిజమైతే ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య సంక్షోభంగా మారుతుందని,13 కోట్ల మంది ఓటర్ల హక్కులను తొలగించారనే ఆరోపణలు ఉన్నాయని,ఓటు హక్కును ప్రజల నుంచి దూరం చేసే ప్రయత్నాలు జరిగితే అది ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు అని తెలిపారు.ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు తమ రాజ్యాంగ బద్ధమైన బాధ్యతలకు అనుగుణంగా వ్యవహరించకుండా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే భావన ప్రజల్లో కలుగుతోందని పేర్కొన్నారు.
ఎంపీ డిమాండ్లు:
ఎన్నికల్లో అవకతవకల ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి.
ఓటర్ల హక్కులను పూర్తిగా పరిరక్షించాలి.
ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకం కలిగేలా పారదర్శకత పాటించాలి
ఎన్నికల సంఘం తన బాధ్యతలను నిష్పక్షపాతంగా నిర్వర్తించాలి.
చీటింగ్ చేసి పరీక్షలో పాస్ అయిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పే వారు, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఆరోపణలపై ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు.ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు.