Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

స్పెషల్ క్యాంపెయిన్ 6.0 లో భాగంగా స్వచ్ఛతా కార్యక్రమం

Author
Posted By MANA PRAJA AKSHARAM
| 07 Oct 2026, 01:12 PM | Array
స్పెషల్ క్యాంపెయిన్ 6.0 లో భాగంగా స్వచ్ఛతా కార్యక్రమం

ప్రజా అక్షరం,రామగుండం (ప్రతినిధి) అక్టోబర్ 6 :-
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఆదేశాల ప్రకారం సింగరేణి వ్యాప్తంగా అక్టోబర్ 2 నుండి 31 వరకు తలపెట్టిన స్పెషల్ క్యాంపెయిన్ 6.0 - డిస్పోజల్ ఆఫ్ ఈ-వేస్ట్ లో భాగంగా రామగుండం ఏరియా.1 జీఎం కార్యాలయ ప్రాంగణంలో ఎన్విరాన్మెంట్ విభాగం ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించడము జరిగినది.ఈ కార్యక్రమానికి ఆర్జీ.1 ఏరియా జనరల్ మేనేజర్ డి.లలిత్ కుమార్ పాల్గొని ఉద్యోగులతో కలిసి పనికిరాని,పాడైన,ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ పరికరాలను (ఈ-వేస్ట్) సేకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డబ్బాలలో వేయడం జరిగినది.అలాగే జీఎం తో పాటు జీఎం కార్యాలయ ఉద్యోగులు,సిబ్బంది కూడా తమ వద్ద ఉన్న ఈ-వేస్ట్ పరికరాలను సేకరించి ప్రత్యేక డబ్బాలలో పడవేశారు.ఈ కార్యక్రమంలో యస్.ఓ.టు జియం కే.చంద్ర శేఖర్, ఎజియం ఐఇడి ఆంజనేయులు,డిజియం ఫైనాన్స్ ధన లక్ష్మి భాయి, డిజియం ఫారెస్ట్ కర్ణ, పర్యావరణ పరిరక్షణ అధికారి వేణు,ఐటి మేనేజర్ రాజేష్, జూనియర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, అధికారులు,ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.