Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

యోగ ధ్యాన మందిరానికి మౌలిక వసతులు కల్పించాలని వినతి

Author
Posted By MANA PRAJA AKSHARAM
| 07 Oct 2026, 07:46 PM | TELANGANA
యోగ ధ్యాన మందిరానికి మౌలిక వసతులు కల్పించాలని వినతి

చిట్యాల, అక్టోబర్ 7 (ప్రజా అక్షరం ప్రతినిధి):
ఋషి సంస్కృతి యోగ సేవా కేంద్రంలోని నిత్య సాధన యోగ ధ్యాన సదుపాయాలు కల్పించాలని కోరుతూ నిత్య యోగ ధ్యాన సాధకులు చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్, మున్సిపల్ కమిషనర్‌ ఉప్పల గురులింగం కు వినతిపత్రాలు అందజేశారు. నిత్య సాధన యోగ ధ్యాన మందిరం కమిటీ అధ్యక్షుడు మాస శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాధకులు ఈ వినతిపత్రాలను అందజేశారు. యోగ కేంద్రం వరకు సీసీ రోడ్డు నిర్మించాలని, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి లైట్లు అమర్చాలని, యోగ కేంద్రం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని వారు కోరారు. ప్రస్తుతం యోగ సాధకుల ñసంఖ్యకు అనుగుణంగా హాల్ సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, భవనాన్ని విస్తరించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్ మాట్లాడుతూ నిత్య యోగ సాధకుల మౌలిక సదుపాయాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సీసీ రోడ్డు, ప్రహరీ గోడ, విద్యుత్ స్తంభాలు, భవన విస్తరణకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా, సుమారు ఆరు నెలల్లో పనులు పూర్తయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు బూరుగు కృష్ణయ్య, ముఖ్య సలహాదారులు నారబోయిన శ్రీనివాస్, కంచర్ల ఈశ్వరయ్య, నీల సత్యనారాయణ, కమిటీ ఉపాధ్యక్షులు పొన్నం లక్ష్మయ్య, గాదె ఎల్లేష్, కార్యదర్శులు దాడి అరుణ, కోనేటి సాయిరాం, సభ్యులు చోల్లెటి రవీంద్రనాథ్, కుకుడాల లక్ష్మి, పాలాద్రి రమేష్, పోలా సరోజ, మాస స్వరూప, కాచం శాంతి ప్రియ, సిలివేరు శేఖర్, మందాడి మధుసూదన్ రెడ్డి, కంది మోహన్ రెడ్డి, మారగోని రమేష్, పులగం శ్రీనివాస్ రెడ్డి, చికిలమెట్ల అశోక్, పాల రమేష్, దాసరి బిక్షం తదితరులు పాల్గొన్నారు..

యోగ ధ్యాన మందిరానికి మౌలిక వసతులు కల్పించాలని వినతి - Additional Image