Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

డీఎస్పీగా ధరావత్ సబిత నాయక్ కు అభినందనలు తెలిపిన భూక్య సంతోష్

Author
Posted By MANA PRAJA AKSHARAM
| 13 Oct 2026, 07:17 PM | తెలంగాణ, యాదాద్రి భువనగిరి
డీఎస్పీగా ధరావత్ సబిత నాయక్ కు అభినందనలు తెలిపిన భూక్య సంతోష్

డీఎస్పీగా ధరావత్ సబిత నాయక్ కు అభినందనలు తెలిపిన భూక్య సంతోష్


తుర్కపల్లి ,అక్టోబర్ 13 ప్రజా అక్షరం న్యూస్

ఇవి కూడా చదవండి

తుర్కపల్లి మండలం రామోజీ నాయక్ తందాకు చెందిన ధరావత్ సబిత నాయక్ కు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ వన్ లో డీఎస్పీగా నియామక పత్రం అందుకోవడం పట్ల తెలంగాణ గిరిజన సర్పంచ్ల ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్య సంతోష్ నాయక్, రాష్ట్ర కార్యదర్శి ధరావత్ సతీష్ నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డి.ఎస్.పి సబిత తల్లిదండ్రులు నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తులని ఏడుగురు అక్క చెల్లెలు అందులో సబితా చదువుపై చిన్నప్పటినుండే ఆసక్తిగా ఉండేవారని, చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని అత్తా మామ భర్త యొక్క కుటుంబ సహకారంతో చదువుకునే ఆయుధంగా మలుచుకొని ఈరోజు ఈ సాయికి రావడం అనేది మారుమూల తండాల్లో విద్యార్థులకు, యువతకు నేటి తరానికి ఒక ఆదర్శప్రాయంగా నిలిచారని అన్నారు. ఆడపిల్ల పుడితే దండుగా అన్న నేడు అదే ఆడపిల్ల కుటుంబానికి భరోసాగా సమాజానికి ఒక నిదర్శనంగా నిలిచారని అన్నారు. పేదరికంలో పుట్టడం తప్పు కాదు పేదరికంలో మరణించడం తప్పు కాబట్టి నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తులు, విద్యను నమ్ముకొని ఒక లక్ష్యాన్ని ఎంచుకొని లక్ష సాధన దిశగా నిత్యం సాధన చేస్తే తప్పకుండా భవిష్యత్తులో ప్రతి బిడ్డ యొక్క భవిష్యత్తు అత్యంత స్థానంలో ఉంటుందని అన్నారు.