Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సామాజిక, సమానత్వ హితులు-రాజకీయ దీనులు-యాదవులు

Author
Posted By MANA PRAJA AKSHARAM
| 30 Oct 2026, 10:16 AM | యాదాద్రి భువనగిరి, వ్యాసం
సామాజిక, సమానత్వ హితులు-రాజకీయ దీనులు-యాదవులు

ముఖ్యమైన పాయింట్స్:

  • సామాజిక, సమానత్వ హితులు-రాజకీయ దీనులు-యాదవులు

సామాజిక, సమానత్వ హితులు-రాజకీయ దీనులు-యాదవులు

భారతదేశంలో రాజ్యాలను పరిపాలించారు ప్రజలను శాంతి వైపు నడిపించారు. సామాజిక వర్గాలకు సమపాలన అందించారు పశుపోషణతో పచ్చదనం నింపారు. మందలో మరెన్నో రకాల జంతువులకు మంచి మార్గమేశారు. మరో జ్ఞానంతో ప్రతి ఆవును ప్రతి గొర్రెలను పెంపుడు జంతువులను గుర్తించారు చెట్లను కనుగొని చెట్ల చరిత్ర చెప్పారు. ఆహారం అలవాట్లు నేర్పారు బాటసారి గా భలే బాటలు తీశారు. దారి రహదారిగా మంచి మార్గంలో మార్గాలు కనుగొన్నారు. గొంగడి గొప్పతనం తెలిపారు. పశువులకు విద్య నేర్పారు. పాటలతో ప్రవచనాలు నేర్పారు. గొల్లసుద్దులతో కథలలో గొప్పతనం చెప్పారు. పశువులకు పద్ధతులు నేర్పారు. పాలను పలు విధాలుగా అమృతం వలె ఆహారం అందించారు. వెన్న .నెయ్యి. సల్ల. పెరుగు. పాలగా . పాల పద్ధతులు నేర్పారు. కాలాన్ని బట్టి కదిలించారు మందను. మందను కాపాడే క్రమంలో మరెన్నో మృగాలతో కొట్లాడి ప్రాణం అడ్డంపెట్టి కాపాడారు మందను . ఏ ఋతువులలో ఎక్కడ ఉండాలో ఎరుక చేశారు. కాలాన్ని బట్టి కదిలారు.

సామాజిక, సమానత్వ హితులు-రాజకీయ దీనులు-యాదవులు - Additional Image

*యాదవుల చరిత్ర*

భారతదేశ చరిత్రలో యాదవులది అతి ప్రాచీనమైన ఘనమైన చరిత్ర కలిగి ఉన్న సామాజిక వర్గం సబ్బండ జనాలను పాలించి ప్రజలను చైతన్యం చేశారు. యదు మహారాజు. యాదవుల వంశ పురాతన రాజు అయిన యాదవ్ నుండి ఉద్భవించినది యాదవ కులం శ్రీకృష్ణుడు దేవునిగా భగవంతునిగా భగవద్గీత కు బంధువుగా చరిత్రలో నిలిచిన యాదవ వంశం చరిత్రలో చెదరని ముద్ర వేసింది. ఆహారం కోసం అద్భుతమైన చిన్న చిన్న చిరుధాన్యాలను చిగురింపజేసిన యాదవ్ వంశం. అన్ని రకాల ఆహారాలను అందించింది. రాజ్యాలను పరిపాలించి రాజుల వలె ప్రజలను కాపాడిన యాదవ వంశంకు ఎంతో చరిత్ర ఉంది.

సామాజిక, సమానత్వ హితులు-రాజకీయ దీనులు-యాదవులు - Additional Image

*దారి చూపే దారులు వేసిన దయగల హృదయులు యాదవులు*

యాదవులు పశువుల మంద గొర్లమందలను ఆహారం కోసం అడవులకు పెంపుడు జంతువులతో వెళ్లే క్రమంలో తొవ్వమార్గాలే పిల్లబాటలుగా ఏర్పడి దారులు రహదారులుగా ఏర్పడ్డాయి వారు వేసిన బాటలే నేడు రాజబాటలుగా నిలిచాయి యాదవులు వేసిన బాటలలో నేడు మనం నడుస్తున్నాం.

సామాజిక, సమానత్వ హితులు-రాజకీయ దీనులు-యాదవులు - Additional Image

*చెట్ల యొక్క చరిత్రను విప్పి చెప్పిన యాదవులు*

యాదవులు అడవిలోకి వెళ్లి మేకలు ఆవులు గొర్లు. అవి తీసుకునే ఆహారా న్ని అన్వేషణ చేసి శాస్త్రీయంగా వైద్యానికి. ఆహారానికి అవసరమైన చెట్లను గుర్తించి మనకు ఆహారాన్ని అందించారు. మన వైద్యానికి అవసరమయ్యే చెట్లను గుర్తించి చరిత్రలో నిలిపారు. అందులో కొన్ని చెట్లను మన అందించే క్రమంలో ప్రాణాలు కూడా అడ్డంపెట్టి ప్రాణత్యాగం చేసి మరి మనకు నేడు ప్రాణంగా నిలిచారు యాదవులు ప్రతి ఆహారం అందించిన ఆపద్బాంధవులు యాదవులు.

*పశుపోషణలు ప్రమాణాలు నేర్పిన యాదవులు*

జంతువులను మచ్చిక చేసుకుని వాటికి ఆహారం అందిస్తూ మానవులకు కావలసిన ఆహారాన్ని అందించి వాటి నుంచి మానవుడు ఉపయోగించుకునే ఆహార పదార్థాలను వాటి వలన కలిగే లాభాలను సమాజానికి అవసరమయ్యే విధంగా తోడ్పడిన యాదవులు గొర్ల గుంపులో. బర్ల గుంపులో. పశువుల గుంపులో .ఒంటెలను గాడిదలను. కుక్కలను. గుర్రాలను ఉపయోగించుకొని మరి కాలాన్ని బట్టి ప్రాంతాలు తిరుగుతూ ప్రతి మనిషికి ఆహార అందించిన అద్భుత ఆహార పోషకులు యాదవులు

*పాలకు ప్రమాణం నేర్పిన యాదవులు*

జంతువుల పెంపకాలలో పాలలో ప్రతి పదార్థాన్ని మానవ సమాజానికి ఆహారంగా అందించిన అద్భుత పోషకులు మన యాదవులు పాల నుండి పెరుగు పెరుగులో నుండి సల్ల . సల్ల నుండి వెన్న. వెన్న నుండి నెయ్యి తీసి మరి అద్భుతమైన ఆహారం అందించిన ఆపద్బాంధవుడు మన యాదవులు

*పండుగల పద్ధతులు తెలిపిన యాదవులు*

మనకు కష్టాలు నష్టాలు ఎదురైనప్పుడు మనల్ని కాపాడడానికి పండుగలకు ప్రమాణం నేర్పిన పండితులు యాదవ పండితులు కంకణం కట్టడానికి డమరుకం మోగడానికి. పటం వెయ్యడానికి. పాటలు పాడడానికి ప్రవచనాలు చెప్పడానికి పంతులుగా కీడు నుండి అపాయము నుండి అద్భుతంగా రక్షించే పండుగలు తలపెట్టిన పండిత పుత్రులు యాదవులు

*పశువులకు విద్య నేర్పిన పండితుల మన యాదవులు*

ఇవి కూడా చదవండి

రాజుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు యాదవులను అంతం చేయాలని ఒక రాజు కుట్ర చేసినప్పుడు . ఓటమి నుండి విజయం సాధించడానికి యాదవులు ఆవులను గోవులను ఈయడానికి ఇష్టపడక ఆవులకే విద్య నేర్పి అద్భుతమైన పద్ధతిలలో ఆవులను ఆటలతో. ఆవులకు పాటతో . ఆవులకు ఆటలు పాటలు నేర్పించి ఆ రాజును పశువులతో ఓడించి అన్ని మందలను కాపాడి ఆవులను ఆడించిన అద్భుత నేర్పరులు యాదవులు

*గొంగడి గొప్పదనం చెప్పిన యాదవులు*

వాన కాలంలో కొప్పెరగా. కలికాలంలో వెచ్చదనంలా. ఎండాకాలంలో చల్లదనంలా అన్ని కాలాలకు అద్భుతంగా పనిచేసే గొంగడి తయారు చేసి ప్రజలకు గొంగడి అందించి గొంగడి గొప్పదనం చెప్పిన గొంగడి నేతన్నలు మన యాదవులు

*కురుమ గొల్లలు ఒక్కటైతే శాసనాలు శాసిస్తారు*

యాదవులలో విభిన్న వర్గాలున్నప్పటికీ అందరూ ఏకమైతే కుర్మా గొల్ల అన్ని ఒక్కటే ఒకే గొడుగు కిందికి వస్తే. యాదవ కుటుంబాలు చేరితే విజయాలు సొంతమవుతాయి యాదవ అన్న మేలుకో రాజ్యాన్ని ఏలుకో

*శ్రీకృష్ణుని జాంబవంతుని యుద్ధం ఒక చరిత్ర*

వినాయకుని కథలో శమంతక మణి కోసం కొన్ని రోజులుగా శ్రీకృష్ణుడు జాంబవంతుడు ఇద్దరు రాత్రి పగలు కొన్ని రోజులు యుద్ధం చేసినప్పుడు యుద్ధంలో అలసిపోయి జాంబవంతుడు తన కుమార్తెను శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేశాడు జాంబవంతుడు యాదవులకు జాంబవంతునికి మామ అల్లుని వరుస కొనసాగింది. కానీ చరిత్రను వక్రీకరించిన ఆధిపత్య కులాల వారు మాదిగలను యాదవులను వేరు చేశారు ఇద్దరు ఒక్కటైతే ఎప్పటికైనా కష్టమని ఇద్దరి మధ్య బంధాలను తెంచేసి కులం కుంపటి ముందలేశారు ఈ యాదవులు మాదిగలు ఒకటే అయితే రాజ్యాలు వారి సొంతమే అని కుట్ర పన్నారు చరిత్రను వక్రీకరించారు

*మాది గొల్ల పిల్లలు*

మాదిగోల్ల అనే పదంలో అర్థం అద్భుతంగా ఉంటుంది. మాదిగ. గొల్ల. అనే పదాల కలయిక రాజ్యం వైపు పరుగు పెడుతుంది అందుకే మాదిగోల్ల విడగొట్టి మాదిగోల్ల నుండి మాదిగను వేరుచేసి గొళ్లను వేరుచేసి చరిత్రను విభజించి పరిపాలన చేస్తున్నారు నేటి పాలకులు

*యాదవులు ప్రజా ప్రభుత్వాన్ని ఏలాలి*

ప్రజాస్వామ్యంలో యాదవుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ వారు యాదవ రాజులుగా రాజ్యాలను ఏలారని చరిత్ర చెబుతుంది. నేడు మాత్రం శాసనసభలో యాదవుల సంఖ్య కనిపించడం లేదు. పాలనకు వచ్చేవాడు ఎప్పుడైనా యాదవులతో ప్రమాదమని పసిగట్టిన పాలకులు వారికి గొర్లతో బర్లతో బంధం వేసి భలే గమ్మతి చేస్తున్నారు. అందుకే ఆలోచించి యాదవ అన్న మీలో శక్తి ఉంది. భూములు ఉన్నాయి సంపద ఉన్నది. పశువులను జంతువులనే ఆటలాడిపించినోళ్లు. పాటలతో పద్ధతులు నేర్పినోళ్లు.. జంతువులను గంగిరెద్దు వలె గౌరవం నేర్పినోళ్లు మీరు అనుకుంటే ప్రజాస్వామ్యం మీదే పరిపాలన మీదే బర్లని గొర్లనే మంచిగా చేసినోళ్లు మనుషులను చేయలేరా? ప్రజాస్వామ్యం ఎమ్మెల్యేలు కాలేరా? పార్లమెంటు సభ్యులు కాలేరా? పక్క రాష్ట్రాలలో పెద్ద రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా ఏలినోళ్లు. తెలంగాణను ఏలాలి. అనుకుంటే పార్లమెంట్లకు పోలేరా? ప్రజా ప్రభుత్వాన్ని నడపలేరా? ఆలోచన చేస్తే అన్ని నియోజవర్గాలలో పాగా వేయగలరు పాగ వెయ్యగలరు అసెంబ్లీలో అద్భుతమైన ఫలితాలు తీసుకొస్తారు. ఓటుతో వందలాది మందిని కదిలిస్తారు యాదవుల తలుచుకుంటే యాదవ రాజ్యాలను నిర్మించిన యాదవులు ప్రజాస్వామ్యంలో ప్రజలతో నిలబడి కనబడే గెలువగలిగే మనసు గల ప్రజా ప్రతినిధులు యాదవులు. యాదవులందరినీ ఐక్యం చేసి కులాలను ఒక్కటి చేసి సబ్బండ కులాలను సంఘటితం చేసి సాధించవచ్చు హక్కులను ఆత్మ గౌరవాన్ని ప్రజాస్వామ్యంలో పాలనలో పరుగులు పెట్టించేది మీరే శాసనసభలో శాసనాలు చేసే అధికారం మీదే ఆలోచించండి యాదవ్ అన్న అడుగులు వేయండి యాదవ అన్న. పల్లె నుంచి పార్లమెంటు దాక ప్రయత్నాలు చేస్తే పరిపాలన అధ్యక్షులు మీరే యాదవన్న మేలుకో రాజ్యాన్ని ఏలుకో సమ సమాజ నిర్మాణానికి నిర్మాతలు యాదవులే. ప్రజాస్వామ్యాన్ని నిర్మిద్దాం తెలంగాణ రాజ్యం కొరకు ప్రయాణిద్దాం. యాదవులను చట్టసభలకు పంపిద్దాం

*అశోక అక్షరం ఒక ఆయుధం అనే కలం నుండి విశ్లేషణ*

డాక్టర్ ఎన్ అశోక్
M.A.,M.S.W.,B.Ed.,Ph.D.,(LL.B)

విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు

ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్

సెల్ 8499996667