Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

తాత్కాలిక మట్టి రోడ్డు వెంటనే పూర్తి చేయాలి

Author
Posted By MANA PRAJA AKSHARAM
| 31 Oct 2026, 08:49 AM | తెలంగాణ, రాజన్న సిరిసిల్ల
తాత్కాలిక మట్టి రోడ్డు వెంటనే పూర్తి చేయాలి

📌 సరిగా లేని తాత్కాలిక మట్టి రోడ్డు
వెంటనే పూర్తి చేయాలి


రాజన్న సిరిసిల్ల జిల్లా/గంభీరావుపేట/అక్టోబర్30(ప్రజా అక్షరం)

గంభీరావుపేట,లింగన్నపేట మధ్య మట్టి రోడ్డు పనులను నవంబర్ 2వ తేదీలోగాపూర్తి చేసి,విద్యార్థులు,రైతులు,చిరు వ్యాపారులు మరియు ప్రయాణికులకు రవాణా ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు కోడె రమేష్ ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు వినతిపత్రం ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూగంభీరావుపేట లింగన్నపేట మధ్య హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా విద్యార్థులు,రైతులు,చిరు వ్యాపారులు,ఉద్యోగులు మరియు నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు రవాణా సౌకర్యం లేక అనేక అవస్థలు పడుతున్నారు.ముఖ్యంగా నవంబర్ 3వ తేదీ నుంచి,డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో,విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం అత్యంత అవసరం.రోడ్డు సరిగా లేకపోవడం వల్ల విద్యార్థులు పరీక్షలకు ఆలస్యమయ్యే పరిస్థితులు ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.మీరు ఈ సమస్యపై తక్షణమే స్పందించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ మట్టి రోడ్డు పనులను పూర్తి చేయించి,ప్రజలకు సురక్షితమైన రాకపోకల సౌకర్యం కల్పించాలనికోరుతున్నాము.అలాగే హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు ప్రజలకు ఎలాంటి ప్రయాణ ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక రహదారిని పటిష్టంగా ఏర్పాటు చేసి,విద్యార్థులు ముఖ్యంగా పరీక్షలకు హాజరయ్యే,డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన సమస్యగా భావించి సకాలంలో తమ పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా తగు చర్యలకు,మా వినతిని పరిశీలించి వెంటనే తగిన చర్యలు తీసుకుంటారని నవంబర్ 3 వరకు బస్సు సౌకర్యం కల్పించినట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ డాక్టర్ సత్యనారాయణ.మండల ఉపాధ్యక్షులు నర్సింలు.ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు సర్వోత్తమ్.ధార్మిక సంఘం ధార్మిక సెల్ మండల కన్వీనర్ శ్రీనివాస్ చారి.మండల సోషల్ మీడియా కన్వీనర్ దేవేందర్ యాదవ్.శ్రీనివాస్ నర్సింలు.పుల్య నాయక్. శ్రీనివాస్ గౌడ్.దేవేందర్ నాయక్. శ్రీనివాస్.నవీన్.తిరుపతి. దేవరాజు.నాయక్.గణేష్ నాయక్.నాయకులు పాల్గొన్నారు.