Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బియ్యాన్ని బ్లాక్ చేసి అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవు : సివిల్ సప్లై అధికారి రోజా రాణి

బియ్యాన్ని బ్లాక్ చేసి అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవు : సివిల్ సప్లై అధికారి రోజా రాణి

బియ్యాన్ని బ్లాక్ చేసి అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవు

సివిల్ సప్లై అధికారి
రోజా రాణి

తుర్కపల్లి అక్టోబర్ 31 ప్రజా అక్షరం న్యూస్

ఇవి కూడా చదవండి


యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈరోజు అనగా తేది 30.10.2026 రోజున బియ్యం లభ్యత, నిల్వలు మరియు ధరల విషయమై హోల్సేల్,రిటైల్ వ్యాపార కేంద్రాలలో జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీమతి రోజారాణి మరియు సిబ్బందితో తనిఖీలు నిర్వహించటం జరిగింది. భువనగిరి గంజ్ మార్కెట్లో రాహుల్ రైస్ కిరాణం, కల్కి కిరాణం, సహస్ర ట్రేడర్స్, ఓం ట్రేడర్స్ మరియు పలు వ్యాపార కేంద్రాలలో తనిఖీలు నిర్వహించారు. వివిధ రకాల బియ్యం లభ్యత, నిల్వల వివరాలను మరియు ధరలను సమీక్షించారు. ఈ సందర్భంగా వినియోగదారులకు నిరంతరాయంగా బియ్యం సరఫరా జరిగేలా వ్యాపారులు తగినంత నిల్వలను అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైన మేరకు నిల్వలను ఎప్పటికప్పుడు భర్తీ చేసుకోవాలని, బియ్యాన్ని న్యాయమైన ధరలకు విక్రయించాలని సూచించారు. మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించడం, అక్రమంగా నిల్వలు చేయడం, అధిక ధరలకు విక్రయించడం వంటి అక్రమ వ్యాపార పద్ధతులకు పాల్పడరాదని, పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు.
అలాగే, వ్యాపార ప్రాంగణాల్లో స్టాక్ బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేసి, వాటిపై బియ్యం రకం, బియ్యం నిల్వల పరిమాణం మరియు కిలోకు విక్రయ ధరలను స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. స్టాక్ బోర్డులలోని వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని, నిల్వలు, కొనుగోలు మరియు విక్రయాలకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.

జిల్లా పౌరసరఫరాల అధికారి

యాదాద్రి భువనగిరి

జిల్లా ప్రజా సంబంధాల అధికారి (DPRO), యాదాద్రి భువనగిరి గారికీ ప్రచురణ నిమిత్తం