Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది..

ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది..

*ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది..*

*ఎమ్మెల్యే వేముల వీరేశం*

*చిట్యాల, అక్టోబర్ 31 (ప్రజా అక్షరం ప్రతినిధి):*

ఇవి కూడా చదవండి

మండలంలోని ఉరుమడ్ల, పిట్టంపల్లి గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు అనంతరం రైతుల ఖాతాలో వీలైనంత త్వరగా నగదు జమయ్యేలా అధికారులు చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సుంకరి మల్లేష్ గౌడ్, రఘు మా రెడ్డి, చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పోకల దేవదాస్, మండల పార్టీ అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య, సర్పంచ్లు సాగర్ల భానుశ్రీ, సాగర్ల యాదమ్మ, మిర్యాల వెంకటేశం, అందే అండాలు రాములు, ఎమ్మార్వో విజయ్ కుమార్, పల్లపు బుద్ధుడు, కోనేటి యాదగిరి, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు..