Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

తడిసిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలి

తడిసిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలి

తడిసిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలి

అధికారులకు ఫోన్ చేసి ఆదేశించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం:

చిట్యాల, నవంబర్ 01 (ప్రజా అక్షరం ప్రతినిధి):

ఇవి కూడా చదవండి

చిట్యాల పట్టణంలోని ఊరుమడ్ల రైల్వే గేట్ సమీపంలో రైతులు ఆరబోసిన ధాన్యం రాశులు రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నకిరేకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ గౌరవ వేముల వీరేశం స్థానిక కాంగ్రెస్ నాయకులను సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకోవాలని సూచించారు.దీంతో అక్కడికి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పోకల దేవదాస్ ఆధ్వర్యంలో వెళ్లిన కాంగ్రెస్ నాయకులు రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు బాధ్యులు కోమటిరెడ్డి రామిరెడ్డి, కొమిడాల నర్సిరెడ్డి మాట్లాడుతూ.. అక్కడ ఏర్పాటు చేసిన ధాన్యం కల్లం అధికారిక కొనుగోలు కేంద్రం కాదని, సంబంధిత అనుమతులు లేకపోవడంతో ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదని చెప్పారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే స్పందించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం నల్లగొండ డీఎస్ఓకు ఫోన్ చేసి మాట్లాడారు. ఊరుమడ్ల రైల్వే గేట్ సమీపంలోని ధాన్యం కల్లానికి అధికారిక అనుమతులు మంజూరు చేసి కొనుగోళ్లు ప్రారంభించాలని కోరారు. అంతేకాకుండా అకాల వర్షానికి తడిసిన ప్రతి ధాన్యం గింజను కూడా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.రైతులు పండించిన పంటకు నష్టం జరగకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతులకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఎద్దులపురి కృష్ణ ,మున్సిపల్ చైర్ పర్సన్ పందిరి గీతా రమేష్, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీ లక్ష్మీ సైదులు, కౌన్సిలర్లు బొబ్బలి సందీపా రాంరెడ్డి ,కోనేటి ఎల్లయ్య, దేశపాక లతా రాజేష్, జెర్రిపోతుల సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు ఎస్కే ఇబ్రహీం, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు...