Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

జ్ఞానేష్ కుమార్ ను వెంటనే తొలగించాలి : సిపిఎం డిమాండ్

Author
Posted By MANA PRAJA AKSHARAM
| 10 Oct 2026, 06:52 PM |
జ్ఞానేష్ కుమార్ ను వెంటనే తొలగించాలి : సిపిఎం డిమాండ్

*సిపిఎం జాతీయ కార్యదర్శితో సహా జాతీయ నాయకత్వ అక్రమ అరెస్టు నిరసిస్తూ...
సిపిఎం నిరసన కార్యక్రమం*

జ్ఞానేష్ కుమార్ ను వెంటనే తొలగించాలి
సిపిఎం డిమాండ్

వలిగొండ అక్టోబర్ 10 (ప్రజా అక్షరం)

ఇవి కూడా చదవండి

కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు, సీజేపీ లు ఇచ్చిన పిలుపులో భాగంగా ఢిల్లీలో నిరసన వ్యక్తం చేయడం కోసం బయలుదేరుతున్న సిపిఎం జాతీయ కార్యదర్శి ఎంఏ బేబీతో సహా జాతీయ కార్యవర్గాన్ని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సిపిఎం వలిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, మండల కార్యదర్శి సిర్పంగస్వామి లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఓటు చోరీ దొంగ జ్ఞానేష్ కుమార్ ను తప్పించాలని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతున్న పట్టించుకోకుండా నియంతృత్వంగా ఆందోళన చేస్తున్న వారిపై నిర్బంధాన్ని ప్రయోగించడం దేశ రాజధాని ఢిల్లీలోకి రైళ్లను రాకుండా రద్దు చేయడం ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులతో దాడులు చేయించడం రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య అన్నారు ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్న మోడీ షా లకు ప్రజల నుండి ఓటమి తప్పదని హెచ్చరించారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మోడీ షా లు తమ బుద్ధి మార్చుకొని 13 కోట్ల మంది భారతీయుల ఓట్లను తొలగించిన జ్ఞానేష్ కుమార్ ను వెంటనే తొలగించాలని రాజ్యాంగబద్ధంగా ఎన్నికల కమిషన్ ను నియమించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు కూర శ్రీనివాస్, మండల కమిటీ సభ్యులు కల్కూరి రామచంద్రర్, కవిడే సురేష్, పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ, సహాయ కార్యదర్శి నానాచర్ల రమేష్,నాయకులు కొండూరు సత్తయ్య,శీలం ఇందిర, ద్యానబోయిన యాదగిరి,పైళ్ళ సత్తిరెడ్డి,ఆలకుంట్ల నరసింహ, వేముల లక్ష్మయ్య, గంగాపురం వెంకటేష్,కోరబోయిన మహేష్,నరసింహ తదితరులు పాల్గొన్నారు.