Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మండల ప్రజలకు అందని హెచ్‌పీ గ్యాస్‌..

మండల ప్రజలకు అందని హెచ్‌పీ గ్యాస్‌..

గ్యాస్ కోసం రెండు నెలలుగా ఎదురుచూపులు

మండల ప్రజలకు అందని హెచ్‌పీ గ్యాస్‌.. వినియోగదారుల అవస్థలు

ఏడాదిగా నిలిచిన సరఫరా.. సిలిండర్‌ కోసం ఐదు కిలోమీటర్ల ప్రయాణం
పనులు మానుకొని వెళ్లినా దొరకని గ్యాస్‌ బండ.. పట్టించుకోని అధికారులు

ఇవి కూడా చదవండి

రాజాపేట నవంబర్ 1(ప్రజా అక్షరం):

రాజాపేట మండలంలోని గ్రామాలకు హెచ్‌పీ గ్యాస్‌ సరఫరా నిలిచిపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో యాదగిరిగుట్ట గ్యాస్‌ ఏజెన్సీ ద్వారా గ్రామానికి సిలిండర్లు సరఫరా అయ్యేవి. అయితే గ్రామాలకు బచ్చన్నపేట మండలం లింగంపల్లి పరిధిలోని గ్యాస్‌ ఏజెన్సీకి మార్చినప్పటి నుంచి సమస్య మొదలైంది. ఏడాదిగా గ్రామానికి సక్రమంగా హెచ్‌పీ గ్యాస్‌ సరఫరా కావడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. గ్యాస్‌ సిలిండర్‌ కోసం గ్రామస్తులు తమ రోజువారీ పనులను సైతం మానుకొని సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోని ఏజెన్సీకి పలుమార్లు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ వెళ్లిన ప్రతిసారీ సిలిండర్‌ లభించకపోవడంతో నిరాశతో వెనుదిరగాల్సి వస్తోందని చెబుతున్నారు. గ్యాస్‌ కోసం పనులు వదులుకొని వెళ్లడం ఒకవైపు, అక్కడికి వెళ్లినా సిలిండర్‌ దొరక్కపోవడం మరోవైపు తమకు భారంగా మారిందని పేర్కొంటున్నారు. గ్రామానికి గతంలో మాదిరిగా గ్యాస్‌ సరఫరా చేయాలని, లేదంటే గ్రామానికి సమీపంలోనే సిలిండర్లు అందించే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. రెండేళ్లుగా కొనసాగుతున్న ఈ సమస్యపై సంబంధిత గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులు, పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించి మండలం లోని పలు గ్రామాలకు క్రమం తప్పకుండా హెచ్‌పీ గ్యాస్‌ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.